డబ్బున్న తెలుగు దొరలు వీరే

updated: March 7, 2018 15:11 IST

ఫోర్బ్స్ జాబితాలో...తెలుగు బిలియనీర్ లి వీరిద్దరే

 ‘ఫోర్బ్స్‌ 2018 వరల్డ్‌ బిలియనీర్స్‌’ జాబితా వెల్లడించింది. వందకోట్ల డాలర్లు (దాదాపు రూ.6,500 కోట్లు) పైబడిన ప్రపంచ వ్యాప్త సంపన్నులతో ఫోర్బ్స్‌ పత్రిక ఈ జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో మొత్తం 2,208 మంది సంపన్నులకు స్థానం లభించింది.  అందులో మన తెలుగు వాళ్ళు కూడా ఇద్దరు ఉండటం గమనించతగ్గ విషయం. అలాగే గర్వించదగ్గ విషయం.

తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశంలోనే పేరెన్నికగన్న ఫార్మా సంస్థ అరబిందో ఫార్మా అధినేత రామ్ ప్రసాద్ రెడ్డి ఈ సారి కుబేరుల జాబితాలో స్థానం సంపాదించారు. అలాగే దివీస్ ల్యాబ్స్ అధినేత మురళి కూడా ఈ దఫా ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో చోటు సాధించారు. అరబిందో ఫార్మా రామ్‌ ప్రసాద్‌ రెడ్డి 250 కోట్ల డాలర్ల సంపదతో 965వ ర్యాంక్‌ను, దివీస్‌ మురళి 230 కోట్ల డాలర్లతో 1,070వ ర్యాంక్‌ను సాధించారు.  

అరబిందో ఫార్మా రామ్‌ ప్రసాద్‌ రెడ్డి గారి పూర్తి పేరు పెనాక వెంకట రామ్  ప్రసాద్ రెడ్డి.  రైతు కుటుంబంలో పుట్టిన ఆయన చదువులో టాప్ లో ఉండేవారు. ఆ తర్వాత రెడ్డి ల్యాబ్స్ అధినేత స్వర్గీయ అంజిరెడ్డిగారితో పనిచేయటంతో ఫార్మా పరిశ్రమపై దృష్టి పెట్టాలనే ఆలోచన వచ్చింది. దాంతో  హైదరాబాద్ బేసెడ్ అరబిందో ఫార్మా ని స్దాపించి, ఓ ఫార్మా సామ్రాజ్యాన్నే క్రియేట్ చేసారు. ఎక్కువగా డయాబిటిక్, హార్ట్ కు సంభందించిన మందులు తయారు చేస్తూ  ఈ కంపెనీ ముందుకు దూసుకుపోయింది.  125 దేశాల్లో వీరి కంపెనీ మందుకు అమ్మకాలు జరుగుతున్నాయి.

 

దివీస్ ల్యాబ్స్ అధినేత మురళి గారి విషయానికి వస్తే ఆయన యుస్ లో చదువుకుని వచ్చిన సైంటిస్ట్. ఆ తర్వాత ఫార్మా రంగంలోకి ప్రవేశించి అద్బుతాలు చేసారు. దివీస్ లేబరెటీరీ స్దాపించి దాదాపు 30 సంవత్సరాలుగా అనేక ప్రయోగాలు చేసి కనుక్కున్న మందులతో మార్కెట్లో నిలబడ్డారు.  అలాగే పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలకు కావాల్సిన మందులు, ఇతర మెడికల్ ప్రొడక్ట్స్  తయారు చేసి ఇవ్వటం కూడా వీరి కంపెనీ చేస్తూంటుంది. వీరి  Naproxen అనే మందు మార్కెట్లో పెద్ద సంచలనం, అలాగే ఆర్దో సమస్యలకు కూడా వీరు తయారు చేసే మందులకు మంచి డిమాండ్ఉంది 

 ఇక మంగళవారం వెలువడిన  ఈ జాబితాలో ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా అమెజాన్‌ చీఫ్‌ జెఫ్‌ బెజోస్‌ నిలిచాడని ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ మంగళవారం వెల్లడించింది. 18 ఏళ్ల పాటు అత్యంత సంపన్నుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న మైక్రోసాఫ్ట్‌ బిల్‌గేట్స్‌ ఈ ఏడాది రెండో స్థానంలో ఉన్నారని పేర్కొంది. 

 

 

Photo by hiva sharifi on Unsplash

comments